అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశంలో ఇటీవల ఒక నల్ల జాతి వ్యక్తిని అమెరికా పోలీసులు దారుణంగా చంపారు. కాలి తో తొక్కి చంపినా ఘటన అమెరికా వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అసలే ఎన్నికలకు ముందు కరోనాతో వచ్చిన ఇబ్బందులతో ట్రంప్ బాగా నరకం చూస్తున్నారు అని చెప్పవచ్చు.
ఈ తరుణంలో అమెరికాలో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది అని చెప్పవచ్చు. అతనిని ఆ విధంగా చంపడం పై ఇప్పుడు అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో దాదాపు పది శాతం మందికి పైగా నల్ల జాతీయులు ఉంటారు. వాళ్ళు అందరూ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. అదే విధంగా ఈ ఘటనపై అమెరికాకు చెడ్డ పేరు వచ్చింది అని శ్వేత జాతీయులు కూడా బాగా బాధ పడుతున్నారు.
సదరు పోలీసు అధికారుల విషయంలో సర్కార్ వేగంగా నిర్ణయం తీసుకున్నా సరే ట్రంప్ లో ఉన్న వ్యవహారశైలే వారిలో కూడా ఉందని అందుకే ఈ ఘటన జరిగింది అని అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. దీనితో ఈ ప్రభావం ట్రంప్ ఓటమి మీద విజయవకాశాల చూపించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ట్రంప్ ఏ స్థాయిలో వివరణ ఇచ్చినా సరే ఆగ్రహం మాత్రం ఆగే ప్రసక్తే కనపడటం లేదు.