నేడు కానిస్టేబుల్ రాతపరీక్ష… ఈ రూల్స్ పాటించాల్సిందే

-

ఇవాళ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష జరగనుంది. ఇక ఈ పరీక్ష నేపథ్యంలో ఒక గంట ముందు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రావాలని సూచనలు చేసింది పోలీస్ శాఖ.

అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు..

కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. తెలంగాణ పోలీస్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి.. ఐడి మరియు పాస్వర్డ్ లను ఉపయోగించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ ను A4 సైజు పేపర్ లో ప్రింట్ చేసుకోవాలి. దానిపై నిర్దేశిత స్థానంలో దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫోటోనే తిరిగి అతికించాలి. ఫోటోలు కేవలం గమ్ తోనే అతికించాలి. అభ్యర్థులు చేతులకు మెహందీ, టాటూలు ఉంచుకోకూడదు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. ఓఏంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు మత సంబంధం ఉంటే మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారు. అభ్యర్థి పరీక్ష గదిలోకి హాల్ టికెట్ తో పాటు బ్లూ మరియు బ్లాక్ పాయింట్ మాత్రమే తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news