తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ పార్టీ ఎమ్యెల్యేలను అడ్డుకున్నాడు పోలీసులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గరకు బిజెపి ఎమ్మెల్యేలను వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే బిజెపి ఎమ్మెల్యేలు అలాగే పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం బిజెపి ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను… రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన… 400 ఎకరాలను మళ్లీ ప్రభుత్వమే తీసుకుంటోంది. దీన్ని ప్రతిపక్షాలు అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ యూనివర్సిటీలో రంగంలోకి దిగిన జెసిబిలు చెట్లను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లేందుకు బిజెపి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయగా… పోలీసులు అరెస్టు చేశారు.