హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ షాక్‌.. న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

-

న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ నగర పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ కొత్త కమిషనర్‌ ఆనంద్‌ తాజాగా ప్రకటన చేశారు. న్యూ ఇయర్‌ పార్టీల్లో డీజేలకు అనుమతులు లేదని ప్రకటించారు కొత్త కమిషనర్‌ ఆనంద్‌. పబ్‌ లు, రెస్టారెంట్ల కు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందుకు గురి చేయవద్దని… స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే.. చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

కరోనా నిమయ నిబంధనాలను పాటిస్తూ.. వేడుకలు చేసుకోవాలని.. ఈవెంట్లకు పరిమితి మించి పాసులను జారీ చేయవద్దని హెచ్చరించారు హైదరాబాద్‌ కొత్త కమిషనర్‌ ఆనంద్‌. అలాగే పార్టీల్లో డ్రగ్స్‌ పట్టుబడితే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు హైదరాబాద్‌ కొత్త కమిషనర్‌ ఆనంద్‌. జనాల్లోకి సింగర్స్‌ వెళ్లకూడదని..ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఆయన వివరించారు.. కాగా.. డిసెంబర్‌ 31 వ తేదీన.. అర్థరాత్రి 12 గంటల వరకు వైన్స్‌ ఒపెన్ ఉంచుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకన చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version