ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు వీటిని అనుసరించాలి. అయితే ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం.
అల్పాహారాన్ని తీసుకోవడం మానేయద్దు:
చాలామందికి ఉండే బాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అలాగే పోషక పదార్థాలు ఉదయమే ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తప్పక తీసుకోండి.
ఎక్కువ నట్స్ తీసుకోండి:
వాల్ నట్స్, బాదం, పిస్తా మొదలైన నట్స్ ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది అలానే పోషక పదార్థాలు బాగా అందుతాయి.
పంచదారని తగ్గించండి:
పంచదార వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు పంచదార కి దూరంగా ఉంటే మంచిది. పంచదారకు బదులు మీరు బెల్లాన్ని ఉపయోగించవచ్చు.
ఎక్కువ నీళ్లు తాగండి:
ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే ముఖ్యం ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉండాలి. అలానే ఎక్కువ పండ్లు వంటివి తీసుకోవాలి వాటిల్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తీసుకోండి:
ఇంట్లో ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. బయట ఆహారపదార్థాలలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ వంటివి వాడతారు దీని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.
వ్యాయామం చేయండి:
ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది కనీసం అరగంట పాటు ప్రతి రోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఏకాగ్రతతో తినండి:
నెమ్మదిగా ఆహరం తింటే వంట పడుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ తో తినండి ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అలానే అనారోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చు.