మునావర్ ఫారూఖీ షో కి వచ్చే వారిపై పోలీసుల ఆంక్షలు

-

హైదరాబాద్ లో మునవర్ ఫరూకి షో పై సస్పెన్స్ నెలకొంది. మునవర్ ఫరూకి హాజరవుతాడా లేదా అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. తనకు ఫీవర్ రావడంతో నిన్న బెంగుళూరు లో జరగాల్సిన షో పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఐతే కోవిడ్ టెస్ట్ రిజల్స్ట్ కోసం వెయిట్ చేస్తున్నానని ఇన్స్టాగ్రామ్ లో తెలిపిన మునావర్.. మధ్యాహ్నం 12 గంటలకు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి రానున్నట్లు తెలిపాడు. కానీ తాజాగా నెట్వర్క్ సమస్య వల్ల లైవ్ లోకి రాలేకపోతున్నట్లు తెలిపాడు.

తన లైవ్ తర్వాత హైదరాబాద్ షో కి హాజరవుతాడా లేదా అనే అంశంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే శిల్పకళావేదిక లో ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.షో కి నిన్న పర్మిషన్ ఇచ్చారు మాదాపూర్ పోలీసులు. బుక్ మై షో లో పూర్తిగా అమ్ముడుపోయాయి షో టికెట్స్. 2 వేల టికెట్స్ అమ్మారు నిర్వాహకులు. షో ని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, బీజేవైఎం నేతలు హెచ్చరిస్తున్నారు. హిందూ దేవుళ్లను హేళన చేస్తూ షోలు చేస్తే ఊరుకునేది లేదంటున్నారు ఎమ్మెల్యే రాజసింగ్. దీంతో నిన్న ఎమ్మెల్యే రాజసింగ్ ని అరెస్ట్ చేసి లాలగూడా పీఎస్ కి తరలించారు పోలీసులు.

శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మునావర్ ఫరుఖీ షో కి వచ్చే వారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. షో కి వచ్చే వాళ్ళకి మొబైల్ ఫోను ని అనుమతించడం లేదు. వాటర్ బాటిల్స్ ని సైతం లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. చేతుల్లో ఎటువంటి వస్తువులను లోపలికి అనుమతించడం లేదు. సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు శిల్పకళా వేదిక వద్ద ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version