పోలీసుల ఆధీనంలో మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌

-

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు వేదికైన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను తమ అదుపులోకి తసుకున్న పోలీసులు ఫామ్‌హౌస్‌నులో తనిఖీలు చేపట్టారు. సంఘటనాస్థలికి చేరుకున్న శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. నిందితులు డబ్బును ఇంకా ఎక్కడైనా దాచారా అనే కోణంలో సోదాలు చేస్తున్నారు.

అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని.. ఎవరెవరితో మాట్లాడారన్న అంశంపై విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను సేకరించి వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ఫిర్యాదుతో స్వామీజీ, నందు, సతీశ్‌లపై మొయినాబాద్‌ పోలీసులు ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ చట్టం 8, సెక్షన్‌ 120బీ కింద కేసు నమోదు చేశారు. బీజేపీలో చేరేందుకు రూ.100 కోట్లు డీలింగ్‌ నడిపినట్లు రోహిత్‌ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారని, స్వామీజీ, నందు, సతీశ్‌ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. డీలింగ్‌లో భాగంగా తన ఫామ్‌హౌస్‌కు వచ్చారని అందులో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version