హీరోయిన్స్ పరిశ్రమ లో అడుగు పెట్టారంటే వాళ్ళు ఫేడ్ అవుట్ అయ్యే వరకు నటిస్తూనే వుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో హీరోయిన్స్ కెరియర్ చాలా తక్కువ రోజుల్లొ మగిసి పోతోంది. చాలా మంది కొత్త అమ్మాయిలు మోడలింగ్ ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చిత్ర పరిశ్రమ లోకి వస్తూనే వుంటారు. మన వాళ్ళకు కూడా ప్రతి సినిమా లో ఒక కొత్త అందం చూడాలనే తాపత్రయం కూడా వుంది.
రీసెంట్ గా ఒక చిన్న సినిమా తో మెప్పించిన హీరోయిన్ పెళ్లికి ఓకే అంది అని ప్రచారం జరుగుతోంది.ఆమెనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ జోడీగా స్వాతిముత్యం సినిమాలో నటించిన వర్ష బొల్లమ్మ. ఈ సినిమాతో డీసెంట్ హిట్ తన ఖాతా లోకి పడింది. సాధారణంగా తర్వాత సినిమా పై వార్తలు వస్తాయి కాని వర్ష బొల్లమ్మ పెళ్లి విషయంలో లో వార్తలు వస్తున్నాయి.
తాను చిత్ర పరిశ్రమ కు చెందిన ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. తన బిహేవియర్ నచ్చిన సదరు నిర్మాత ఆమెను వారి కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయించాడట. అతని కొడుకు కూడా అంగీకరించాడని , వాళ్ల కుటుంబాలు కూడా మాట్లాడు కున్నాయట. అయితే ఈమె చేతిలో పూర్తి చేయాల్సిన సినిమాలు వుండడం తో వచ్చే సంవత్సరం లో వీరి పెళ్ళి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.