మందులోకి ముక్క లేదని, మేకలను దొంగించిన పోలీసులు..

-

ఏదైనా ఆపద వస్తే మనం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ముఖ్యంగా దొంగతనాలు జరిగితే… వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఆ పోలీసులు దొంగలు అయితే ఏంటి పరిస్థితి..? అవును ఆ పోలీసులే దొంగలుగా మారి మేకలను దొంగలించారు. ఈ ఘటన ఒడిస్సా లో చోటుచేసుకుంది.

goat

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలో.. ఓ మేకల వ్యాపారి మందలో రెండు మేకలు మాయమయ్యాయి. ఈ ఘటన డిసెంబర్ 30వ తేదీన జరిగింది. అయితే దీని పై ఆరా తీస్తే పోలీసులే ఆ మేకలను దొంగిలించారని వారికి సమాచారం అందింది. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అప్పటికే వాటిని కోసేందుకు పోలీసులు సిద్ధం కాగా.. వారిని అడ్డుకున్నారు. తన మేకలు తనకు ఇవ్వాలని ఆ వ్యాపారి అడిగాడు. అయినా పోలీసులు అవేవి పట్టించుకోకుండా అతని బెదిరించారు. దీంతో పై అధికారులకు ఆ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ… ఏ ఎస్ ఐ తో పాటు పలువురు ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version