హీరో శివాజీ మీద పోలీస్ కేసు ??

-

సినీ నటుడు ఆపరేషన్ గరుడ శివాజీ గతంలో టీవీ9 రవి ప్రకాష్ తో కలిసి టీవీ9 సంస్థ విషయంలో పెట్టుబడుల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని వార్తల్లో సంచలనం అయ్యారు. అంతకుముందు ఆపరేషన్ గరుడ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నేతలపై మరియు అధికార పార్టీ నేతల పై ఇతర పార్టీల నాయకుల పై తీవ్రస్థాయిలో ఢిల్లీ నుండి కొంతమంది దాడులు చేయడానికి రెడీ అవుతున్నారు అంటూ మాట్లాడుతూ జాతీయ స్థాయి పార్టీ ఇదంతా వెనకనుండి నడిపిస్తుందని కీలకమైన వ్యాఖ్యలు చేసి అప్పట్లో ఆంధ్ర రాజకీయాల్లో హైలెట్ అయ్యారు.

అంతేకాకుండా భారతీయ జనతా పార్టీపై మరియు అదే విధంగా ప్రధాని మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ టీవీ9 కేసు విషయంలో ఇరుక్కుని దేశం అక్రమంగా దాటాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. అయితే గత ఆరు నెలలుగా కనిపించని హీరో శివాజీ తాజాగా అమరావతి రాజధాని వ్యవహారంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ స్టూడియోలో రావడంతో …కాలర్ ఫోన్ చేసి హీరో శివాజీ పై గతంలో ఆయన వ్యవహరించిన తీరుపై సొంత చెల్లెలు లాంటి అమ్మాయిని లేపుకెళ్లి పోయాడని ఇలాంటి వ్యక్తిని స్టూడియోలో కి తీసుకు రాకూడదు అని కాలర్ మాట్లాడుతున్న తరుణంలో శివాజీ దారుణంగా అసభ్యకరమైన బూతు పదం వాడటంతో విషయం పెద్దదై పోవడంతో సదరు న్యూస్ ఛానల్ వాళ్ళు కలర్ కట్ చేయడం జరిగింది.

 

అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ఫోన్ కలర్ సదరన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఫోన్ చేసి బెదిరిస్తూ హీరో శివాజీ పై పోలీస్ కేస్ పెడతా కి రెడీ అవుతున్నట్లు తెలిపినట్లు సమాచారం. ఆ ఫోన్ కాల్ రికార్డు కూడా జాగ్రత్త పరచాలని ఆ ఫోన్ కాలర్ సదరు న్యూస్ ఛానల్ కి బెదిరింపు వార్నింగ్ ఇచ్చినట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version