టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా, అతను జట్టులోకి వచ్చేసాడు…!

-

గౌహతి వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీం ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తో జరిగిన వన్డే సీరీస్ ని గెలుచుకున్న టీం ఇండియా ఆత్మ విశ్వాసంతో శ్రీలంకతో మ్యాచ్ కి సిధ్దమైంది. కొత్త ఏడాది జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు కూడా ఎలా అయినా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ కి ముందు జరుగుతున్న ఈ సీరీస్ లో సత్తా చాటాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ సీరీస్ కి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వగా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి రాగా కేఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా జట్టుకు నాలుగు నెలలుగా దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా జట్టులోకి వచ్చాడు.

టీం ఇండియా

శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీష్ పాండే, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, చాహల్

శ్రీలంక

లసిత్ మలింగ(కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దాసున్ షానకా, కుసల్ జనిత్ పెరెరా, నిరోషన్ డిక్వెల్లా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదనా, భానుకా రాజపక్సే, ఓషాడా ఫెర్నాండో, వనిండు హసరంగ, లాహిరు కుమార, కుసాల్ మెండిస్, లక్షన్ సందకన్

Read more RELATED
Recommended to you

Exit mobile version