గాసిప్: బాబుకు 50 నెంబరు కలిసివచ్చేలా ఉందా?

-

సాధారణంగా మిగిలిన జనాలతో పోలిస్తే సినిమావాళ్లకు, రాజకీయా నాయకులకు సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అని అంటారు! అంటే.. రెండు రంగాలూ కోట్లతో కూడుకున్న వ్యవహారాలే కావడమే కారణమో లేక మరేమైనా కారణమో తెలియదు కానీ… ఈ రెండు రంగాల వారికీ సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి! ఈ క్రమంలో తాజాగా కరోనా అనంతరం బాబుకు 50 నెంబరుపై బాగా సెంటిమెంట్ పెట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం బాబు బహిరంగంగా ప్రకటించిన ప్రకటన ఒకటి అయితే… బాబు వెనకాల చేసిన ప్రకటన ఒకటి అనే గాసిప్ లే కారణం!!

వివరాళ్లోకి వెళ్తే… విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనకు సంబందించి మృతుల కుటుంబాలకు రూ. 50 వేల సాయాన్ని ప్రకటించారు చంద్రబాబు! జగన్ కోటిని వెటకారం ఆడిన చంద్రబాబు… మహానాడు వేదికగా, మృతులకు మౌనం పాటించి ఈ సాయాన్ని ప్రకటించారు! దీనిపై వస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… అనంతరం ఒక గాసిప్ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తుంది! ఇది పూర్తిగా వాస్తవమేనా… లేక నిప్పు లేకుండా పొగరాదుకదా… అనే ఆలోచనలు కాసేపు పక్కన పెడితే… రాబోయే నాలుగేళ్లూ పార్టీలోనే ఉంటే 50 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ డైరెక్ట్ ప్యాకేజి ఇస్తామని బాబు చెబుతున్నారని అంట!!

అవును… ఇప్పటికే ముగ్గురు, మరో ఇద్దరు… మొత్తంగా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా వైకాపా కండువాలు కప్పుకోకపోయినా.. టీడీపీ జెండాలు తీసివేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవన్నీ నిజమయ్యి, మరొక్క ఎమ్మెల్యే గనుక టీడీపీ కండువా తీసి పక్కన పాడేస్తే మాత్రం బాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది! ఈ సమయంలో రిస్క్ చేయకుండా ప్రతిపక్ష హోదా పోగొట్టుకోకుండా… ఏభై కోట్లు చొప్పున ఇచ్చి అయినా కండువాలు తీయకుండా చూసుకోవాలని బాబు ఆరాటపడుతున్నారట! దీంతో… బాబుకు 50 నెంబరు కలిసివచ్చేలా ఉందని అభిమానులు ఫీలవుతున్నారట! దీంతో… వస్తోన్న కథనాలు నిజం కాకుండా, వారంతా పసుపు కండువాలు పక్కన పెట్టని పక్షంలో… ఈ సెంటిమెంట్ ని తమ్ముళ్లు కన్ ఫాం చేసేసుకోవచ్చేమో!!

Read more RELATED
Recommended to you

Latest news