సాధారణంగా రాజకీయాల్లో జంపింగ్‌లు సహజంగానే జరుగుతాయి. ప్రతిపక్ష పార్టీలో ఉండే నాయకులు అధికారం కోసం ఆశపడి పార్టీలు మారిపోతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ జంపింగులు ఎక్కువగానే జరుగుతాయి. అయితే అలా జంపింగ్ చేసిన వారికి తర్వాత రాజకీయంగా కలిసొస్తుందా? అంటే ఒకోసారి కలిసొస్తుందని, ఒకోసారి ప్రజలు వారికి చుక్కలు చూపించడం ఖాయమని చెప్పొచ్చు.
అలా టీఆర్ఎస్‌లోకి వచ్చిన జంపింగ్ ఎమ్మెల్యేలకు ఆ తర్వాత జరిగిన ఎన్నికలు అంటే 2018 ఎన్నికల్లో పెద్దగా షాక్ తగలలేదు. ప్రజలు మళ్ళీ వారిని తిరిగి గెలిపించారు. అయితే రెండోసారి టీఆర్ఎస్‌లోకి అధికారంలోకి వచ్చాక కూడా జంపింగులు జరుగుతూనే ఉన్నారు. మొదటి సారి అంటే మెజారిటీ తక్కువ ఉండటంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలని తీసుకున్నారు. కానీ రెండోసారి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూడా కేసీఆర్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నారు.
కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. ఇలా కారు ఎక్కిన జంపింగ్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ పోరాటం చేస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం జంపింగ్ ఎమ్మెల్యేలని ప్రజలు తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లో జంపింగ్ నేతలకు ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు.