విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌…ఇక ఫ్రీ కోచింగ్‌

-

ఎంసెట్, నీట్, ఐ ఐ టి కు సిద్దమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్ అందించనుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు ప్రయివేటు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం నాడు సాయంత్రం తన కార్యాలయంలో షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్ ను ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందాలని పిలుపునిచ్చారు.

నిష్ణాతులైన లెక్చరర్లతో ఈ ఆన్లైన్ కోచింగ్ నిర్వహిస్తున్నామని, ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఆన్లైన్ కోచింగ్ ను నిర్వహిస్తున్నామని, స్వల్ప సమయంలో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆన్లైన్ కోచింగ్ ను http://tscie.rankr.io లింక్ ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. గత సంవత్సరం కూడా ఎంసెట్, నీట్, ఐ ఐ టి కి సిద్దమైన విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వగా రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థులు వీటికి హాజరయ్యారని మంత్రి తెలిపారు. వీరిలో 2685 మంది విద్యార్థులు మంచి ర్యాంకింగులు సాధించారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశం వినియోగించుకొని విద్యార్థులు విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version