కాంగ్రెస్-కమలం మధ్యలో కేసీఆర్‌…లాభామా? నష్టమా?

-

తెలంగాణలో ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. మొన్నటివరకు కేసీఆర్ ( KCR ) దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉనికి లేకుండా పోయింది. కానీ ఊహించని విధంగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది. గతంలో బీజేపీకి ఇక్కడ పెద్ద సీన్ లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బీజేపీకి బలపడే ఛాన్స్ వచ్చింది. దుబ్బాక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ని బీజేపీలోకి తీసుకొచ్చి, హుజూరాబాద్‌ బరిలో టీఆర్ఎస్‌ని ఓడిస్తామని చెబుతున్నారు.

cm-kcr

అటు మొన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందనే సమయంలో, రేవంత్ రెడ్డి పీసీసీ పీఠంలోకి వచ్చి రేసు మొదలుపెట్టారు. ఈయన కూడా కేసీఆర్‌పై యుద్ధం మొదలుపెట్టారు. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించుతానని రేవంత్ సవాల్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీకి పెద్ద సీన్ లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇలా ప్రతిపక్షాలు రెండువైపులా దాడి మొదలుపెట్టడంతో కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా అనే విశ్లేషణలు ఎక్కువగా వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ప్రతిపక్షాల దూకుడు కేసీఆర్‌కు కాస్త ఇబ్బందే అని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో ఈ రెండు పార్టీలు కొట్టుకుంటే, కేసీఆర్‌కు లబ్ది చేకూరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ బీజేపీకి రాష్ట్ర స్థాయిలో బలం లేదు. కొన్ని ప్రాంతాల్లోనే బీజేపీకి బలం కనిపిస్తోంది. అసలు బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారుగానీ, క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ లేదు. అటు కాంగ్రెస్‌లో రివర్స్…ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. కానీ నాయకులు లేరు. కానీ రేవంత్ రెడ్డి ఇమేజ్ మీద కాంగ్రెస్ బలపడే అవకాశాలు లేకపోలేదు.

కానీ నెక్స్ట్ హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటాయి. అంటే అప్పుడు కేసీఆర్‌కే లాభం జరుగుతుందని అంటున్నారు. ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. చూడాలి మరి కాంగ్రెస్-కమలం మధ్యలో కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version