పాలిటిక్స్‌ నాకు ఫుల్‌టైమ్‌ జాబ్‌ కాదు : యోగి ఆదిత్యనాథ్‌

-

తన రాజకీయ జీవితంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని, పార్టీ తనను యూపీ ప్రజల కోసమే నియమించిందని.. అందుకే రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నానని తెలిపారు. తనకు పాలిటిక్స్ ఫుల్ టైమ్ జాబ్ కాదని, తాను ఒక యోగి అని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

“ప్రతి పనికి ఒక కాలపరిమితి ఉంటుంది. నా రాజకీయ జీవితానికి కూడా పరిమితి ఉంది. బీజేపీ హైకమాండ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే నేను సీఎం కుర్చీలో కూర్చున్నాను. పార్టీ పెద్దలతో విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగేవాడిని కాదు. ఎవరో ఒకరు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. వాటిని నేను పట్టించుకోను.” అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version