అవును సీటు ఇవ్వకపోతేనే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి..కొందరు ఎమ్మెల్యేలని సైడ్ చేస్తేనే మళ్ళీ అధికారం కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ దిశగానే కేసిఆర్ ఆలోచన చేస్తున్నారు. ఎలాగో ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విధంగా పదునైన వ్యూహాలతో ఆయన ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలో కూడా కీలక మార్పులు చేస్తేనే గెలుపుకు బాటపడుతుందని చెప్పాలి. లేదంటే బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం తప్పదు.
అయితే ఎమ్మెల్యేలు ఎవరు చేజారి పోకుండా..సిట్టింగులకు సీటు అని కేసిఆర్ ప్రకటించారు. అదే సమయంలో మీ సీటు మీ చేతుల్లోనే ఉందని చెప్పేశారు. అంటే సరైన పనితీరు, ప్రజల్లో ఉండేవారికే సీటు ఇస్తానని అన్నారు. అలా కాకుండా ప్రజల్లో సరిగ్గా లేకుండా..సరైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలని మాత్రం సైడ్ చేయడం గ్యారెంటీ అని కేసిఆర్ అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు పై పలు రకాలుగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా బాగోలేదని తెలుస్తుంది. అలాంటి వారికి కేసిఆర్ మరొక అవకాశం ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు పనితీరు మెరుగు పర్చుకుని.. గెలుపు దిశగా ఉంటేనే సీటు ఇస్తానని, లేదంటే సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు.
అయితే బిఆర్‌ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119లో 104 బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..మరి 104 మందికి సీట్లు ఇవ్వడం సాధ్యమేనా అంటే అది సాధ్యపడదనే చెప్పాలి. 2018 ఎన్నికల్లో 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసిఆర్ సీటు ఇవ్వలేదు. కాకపోతే అప్పుడు పరిస్తితులు వేరు..పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయి. ఇప్పుడు కాస్త పరిస్తితి వేరు. ప్రతిపక్షాలు రేసులో ఉన్నాయి.
కాబట్టి కేసిఆర్ జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా ఓ పాతిక మందికి సీట్లు డౌటే అని తేలుతుంది. వారికి సీట్లు ఇవ్వకపోతేనే పార్టీ గెలుస్తుందనే పరిస్తితి ఉంది. చూడాలి మరి కేసిఆర్ ఎంతమందికి సీట్లు ఇవ్వకుండా పార్టీని గెలిపిస్తారో.