1 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థగా యూపీ

-

ఉత్తర ప్రదేశ్ శకం మొదలైందన్న సీఎం యోగీ

దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాయూపీని మార్చేందుకు ప్రణాళికలు
సెప్టెంబరులో ఇంటర్నేషనల్ ట్రేడ్ షోకి సన్నాహాలు
వ్యాపారులను పెద్ద ఎత్తున ఆహ్వానించనున్న ప్రభుత్వం

దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేపథ్యంలో భారీ లక్ష్యం వైపుగా అడుగులు వేస్తోంది సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజిన్ సర్కార్.అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ఆదర్శంగా నిలవడమే కాదు ప్రధాని నరేంద్ర మోడీ కలను సాకారం చేసేందుకు యోగి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో యుపి ఫర్ యుపి, యుపి ఫర్ ఇండియా, యుపి ఫర్ గ్లోబల్ అనే నినాదాన్ని తీసుకువచ్చారు సీఎం. సెప్టెంబరులో గ్రేటర్ నోయిడాలో జరగనున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోకు సంబంధించి ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించారు.. యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తరహాలో ట్రేడ్ షోను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.ఈ సమ్మిట్ లో పాల్గొనే వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని సూచించారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాలం మొదలైందన్న ముఖ్యమంత్రి ట్రేడ్ షో ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు అన్నిరకాల చర్యలను ముమ్మరం చేశారు.పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి దేశ అభివృద్ధిలో ఉత్తర ప్రదేశ్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని చెప్పారు. దీనిని ఎవరు జాప్యం చేసినా, నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.ఈ మేరకు ముఖ్యమంత్రి అన్ని రంగాల వారీగా స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ బృహత్తర లక్ష్యం కోసం ఆయన ఐదేళ్ల గడువు విధించారు. 2027 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ఆదాయ-వ్యయం, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన శాఖల అధికారులతో సీఎం సమీక్షించి స్పష్టమైన సూచనలు చేశారు.

ప్రధానమంత్రి విజన్‌ ​​ప్రకారం ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమైన రంగాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.వీటిలో వ్యవసాయం,పర్యాటకం, IT మరియు ITES రంగాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇంధనం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, విద్య, ఫుడ్ ప్రాసెసింగ్, MSME తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని పెద్ద మెట్రోలను వివిధ రంగాల హబ్‌లుగా అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.ఈ క్రమంలో లక్నోను దేశంలోనే తొలి కృత్రిమ నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version