5 స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్: ముందంజలో యోగీ, అఖిలేష్…

-

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాయి. పంజాబ్ లో ఆప్ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది. అయితే పలు స్థానాల్లో కీలక నేతలు ముందంజలో ఉన్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం అభ్యర్థి యోగీ ఆదిత్య నాథ్ గోరఖ్ పూర్ తూర్పు నుంచి  ముందంజలో ఉండగా… కర్హల్ నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందంజలో ఉన్నారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ ముందంజలో ఉన్నారు. మరోవైపు పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చన్నీ తాను పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నారు. పాటియాలా నుంచి కెప్టెన్ అమరిందర్ సింగ్ ముందంజలో ఉన్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూకూడా అమృత్  సర్ నుంచి ముందంజలో ఉన్నారు. ఇక గోవాలో బీజేపీ సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్ సాంక్వెలిన్ స్థానంలో ముందంజలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version