ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పతంగి పార్టీ భారీ షాక్ తగిలింది. అసదుద్దుదీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి యూపీ ఓటర్లు షాక్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తామని అనుకున్న ఎంఐఎం పార్టీని యూపీ ఓటర్లు కనికరించలేదు. ముస్లీం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. యూపీలోని 403 స్థానాల్లో 100 స్థానాలకు ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. భగీరథ పరివర్తన్ పేరుతో కూటమి కట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. కేవలం 0.35 శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకుంది. మరోవైపు ఎస్పీ పార్టీకి ఎంఐఎం పార్టీ ప్రభావం పడింది. చాలా స్థానాల్లో మైనారిటీ ఓట్లను చీల్చింది ఎంఐఎం. దీంతో కొన్ని స్థానాల్లో ఎస్పీ విజయాలపై ప్రభావం చూపించింది. యూపీ ఎన్నికల సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు జరిపారు కొంతమంది దుండగులు. ఈ ఘటన ఎంఐఎంపై సానుభూతిని తీసుకురాలేదు. ఎన్నికల సయమంలో అసదుద్దీన్ ఓవైసీ యూపీలో విస్త్రుతంగా ప్రచారం చేసినా.. ఆపార్టీని యూపీ ఓటర్లు కనికరించలేదు. యూపీలో పాగా వేయాలనుకున్న ఎంఐఎం కలలు కలలుగానే మిగిలిపోయాయి.