యువతీ, యువకులకు అద్భుతమైన అవకాశం.. ఆడుదాం ఆంధ్రా..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అనే క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా క్రీడా చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో 15 సంవత్సరాలు పైబడిన యువతీ, యువకులందరూ పోటీలలో భాగస్వాములు అయ్యేలా ఓపెన్ మీట్ చేపడుతున్నది. యువతలో క్రీడా క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్ లో క్రీడా పోటీలను గ్రామీణ, వార్డు, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలలో డిసెంబర్ 15, 2023 నుంచి ఫిబ్రవరి 03, 2024 వరకు ఎంపిక చేసిన 5 క్రీడలను నిర్వహించనున్నారు.

 

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు దాదాపు 51 రోజుల పాటు 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.5 లక్షల మ్యాచ్ లు, 680 మండలాల్లో 1.42 లక్షల మ్యాచ్ లు, 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్ లు, 26 జిల్లాల్లో 312 మ్యాచ్ లు చివరగా రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ లు మొత్తంగా అన్ని స్థాయిల్లో కలిసి 2.99లక్షల మ్యాచ్ లు నిర్వహించబడుతాయి.

ఈ క్రీడా పోటీలు తొలుత గ్రామ లేదా వార్డు స్థాయిలో నిర్వహించబడుతాయి. ఇందులో గెలిచిన జట్లు మండలస్థాయికి ఎంపిక కాబడుతాయి. మండల స్థాయిలో గెలుపొందిన జట్లు నియోజకవర్గ స్థాయికి.. నియోజకవర్గ స్థాయిలో గెలిచిన జట్టు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలిచిన జట్టు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లు, ట్రోఫిస్, పతకాలు అందజేయనున్నారు. క్రికెట్, వాలిబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో-ఖో వంటి 05 క్రీడాంశాల్లో అన్ని క్రీడా సామాగ్రిని మొత్తం ప్రభుత్వం వారే ఏర్పాటు చేస్తారు.

ఈ పోటీలకు కావాల్సిన స్టేడియాలను సిద్ధం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా పోటీలు డిసెంబర్ 15న ప్రారంభమై ఫిబ్రవరి 03, 2024న విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి సంబురాల్లో ముగుస్తుంది. ఈ టోర్నమెంట్ కి సంబంధించి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ జరుగుతుందని శాప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధ్యాన చంద్ర హెచ్.ఎం.ఐఏఎస్ తెలిపారు.

రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

1.15 సంవత్సరాల వయస్సు పైబడిన యువతి, యువకులు మీకు సమీపంలో ఉన్న సచివాలయంలో నమోదు చేసుకోవచ్చు.
2.ఆన్ లైన్ లో https:aadudamandhra.ap.gov.in/login లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
3.రిజిస్టర్ కోసం 1902 నెంబర్ కి కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రకటించడంపై సంతోషిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి అంటూ సీఎం ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను కూడా ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version