హలో గువ్వల బాలరాజా.. ఎప్పుడు రాజీనామా చేస్తున్నావ్!

-

హుజూరాబాద్ ఉప పోరు ముగిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటిసారి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 83,167 ఓట్లు సాధించడంపై కొంత మేరకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఎన్నికలకు ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ గెలుపుపై ఆయన వ్యక్తం చేసిన సవాల్ ఇందుకు కారణమైంది. ఎప్పుడు రాజీనామా చేస్తున్నావ్ అంటూ పలువురు గువ్వల బాలరాజ్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

రాష్ట్రంలో హుజూరాబాద్ ఉపఎన్నికలు ఉత్కంఠను రేపాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది. టీవీ చానాళ్ల వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. అయితే, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒకడుగు ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

హుజూరాబాద్‌లో ఎట్టిపరిస్థితుల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని, గెల్లు శ్రీనివాస్ విజయం తథ్యమని గువ్వల బాలరాజ్ ఓ టీవీ చానల్ డిబెట్‌లో ఢంకా బజాయించి చెప్పారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కనీసం డిపాజిట్‌ కూడా రాదని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైతే కమలం పార్టీకి డిపాజిట్ వస్తుందని, కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తే బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదన్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఎన్నికలు ముగిశాయని బీజేపీ గెలవడం, టీఆర్‌‌ఎస్ ఓడిపోవడం జరిగిపోయాయి. ఇది అచ్చంపేట ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.

సవాల్‌కు తలొగ్గిన వెంటనే గువ్వల బాలరాజ్ తన ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని కొంత మంది డిమాండు చేస్తున్నారు. మరికొందరైతే ఆయనకే నేరుగా ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. మరి.. సవాల్‌కు కట్టుబడి గువ్వల బాలరాజ్ రాజీనామా చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version