దీపావళి సమయంలో క్రాకర్స్ వల్ల కాలుష్యం ఏర్పడుతుందని పలు రాష్ట్రాలు క్రాకర్స్ ను నిషేధించాయి. వీటిపై కోర్టులు కూడా ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేశాయి. కేవలం అనుమతించిన సమయంలోనే క్రాకర్స్ ను కాల్చాలంటూ పలు రాష్ట్రాలు నిబంధనలు విధిస్తున్నాయి. కాగా ఈ నిషేధాలపై సద్గురు జగ్గీవాసు దేవ్ విమర్శలు గుప్పించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రాకర్స్ కాల్చాలనే పిల్లల ఆశలను అడ్డుకోవద్దని అన్నారు. వీరి సంతోషాన్ని దూరం చేయద్దని అన్నారు.
దీపావళి క్రాకర్స్ బ్యాన్ పై జగ్గీవాసు దేవ్ సంచలన వ్యాఖ్యలు
-