పరిషత్ కి ఎగరలేనమ్మ… అసెంబ్లీకి ఎగురుతాదంట!

-

పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎంత విలువైనవో చంద్రబాబుకు తెలియకపోయింది! అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్నికలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాటిని వదిలేశారు! కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే బాబు దృష్టిలో సరైన ఎన్నికలేమో! అయితే… తాజాగా విడుదలయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు బాబు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తున్నాయి! విచిత్రం ఏమిటంటే… ఈ ఫలితాలపై అచ్చెన్నాయుడు డిఫరెంట్ గా స్పందించడం!

అవును… ఆ మధ్య జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఫలితం ముందే తెలిసిందో ఏమో కానీ.. టీడీపీ చేతులెత్తేసింది! ఎన్నికలను బహిష్కరించడం అంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అన్న విషయం మరిచిపోయింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలని కూడా కోరింది. కోర్టు మెట్లూ ఎక్కింది! అయితే… ఇపుడు పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తూంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల ఫలితాలతో తమకు సంబంధం లేదు అంటున్నారు.

పోనీ అక్కడితో ఆగితే పర్లేదు.. వారి ఆత్మవంచన అంతేలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ… రాష్ట్ర శాసనసభ రద్దు చేసి జగన్ ఎన్నికలకు సిధ్ధం కావాలని డిమాండ్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు. అంటే మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ఇప్పుడు పెట్టెయ్యాలంట. అలా పెడితే టీడీపీ గెలిచేస్తుందని అచ్చెన్నాయుడు గట్టిగా నమ్ముతున్నారన్న మాట. సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు చూశారు.. ఫలితంగా పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు.

మరోపక్కేమో ఫ్యాన్ గాలి విపరీతంగా వీస్తుంది.. ఎక్కడికక్కడ క్లీన్ స్వీప్ లు చేసుకుంటూ పోతుంది. మరోపక్క టీడీపీ కేడర్ కొద్దికొద్దిగా జారిపోయింది.. ఆత్మనూన్యతాభావంలోకి నెట్టబడుతుంది. అయినా కూడా… అచ్చెన్న ఈ స్థాయి మాటలు మానడం లేదు! ఫలితంగా… “పరిషత్ కి ఎగరలేనమ్మ… అసెంబ్లీకి ఎగురుతాదంట” అనే కామెంట్లకు స్థానం కల్పిస్తున్నారు!

ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబుకు సొంత ప్రాంతం నారావారిపల్లిలో ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. ఇక్కడ టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలవ్వడం కొసమెరుపు!

– CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version