అక్కడ అధికార పార్టీలో గ్రూప్ లు చాపకిందనీరులా విస్తరిస్తున్నాయా…నియోజకవర్గంకు ఎమ్మెల్యేనే బాస్ అని కేసిఆర్ చెప్పినా నేతలు జట్లు కడుతున్నారా..ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా యవ్వారం నడుస్తుంది..ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు,ఇతర నేతల మద్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుంది..మున్సిపల్ ఎన్నికలు,సహాకార సంఘాల ఎన్నికలతోపాటు డీసీసీబీ ఎన్నికలు పార్టీనేతల మద్య లొల్లికి కారణమైయ్యాయటా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు గ్రూపులు కట్టారు గులాబీ పార్టీ నేతలు.
మంత్రి పదవి పోయాక ఎమ్మెల్యే జోగురామన్న నారాజులో పడిపోయారు..ఆతర్వాత వచ్చిన ఎన్నికల్లో మంత్రిపదవి లేకుండా పాయే అనుకున్నారో ఏమో కాని తన తనయుడికి మున్సిపల్ చైర్మెన్ ను చేయడం మిగతా నేతలకు మింగుడుపడలేదంటా…చైర్మన్ కాకుండా ఎంతో మంది ఎత్తులేసినా ఆఖరికి చిత్తై చైర్మన్ గా జోగు ప్రేమేందర్ అయ్యాడు…ఇది తట్టుకోలేని వారు ఒక ఇంట్లో జోడు పదవులా అని అంటూ అధిష్టానం వద్దకెల్లి లొల్లి చేసే ప్రయత్నం చేసిన వ్యూహాలు ఫలించలేదంటా..దీంతో ఒక్కరిద్దరు నాయకులు వేరువేరుగా గ్రూప్ లు కట్టేప్రయత్నాల్లో బిజి అయ్యారనే టాక్ పార్టీక్యాడర్ లో జోరుగా చర్చసాగుతుంది..
డీసీసీబీ చైర్మన్ పీఠం ఆశించిన వారితోపాటు మున్సిపల్ చైర్మన్ టికెట్ కోసం ఆశించి భంగపడ్డ వాళ్లు ఒక్కోక్కరుగా జారిపోతున్నారంటా..నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ …పైగా పలు సందర్బాల్లో ఇదే విషయం పార్టీపెద్దలు సైతం చెబుతూ వస్తున్నారు..ఈక్రమంలో తమకు అవకాశాలు రాలేదని బాథతొ కొంతమంది ఎమ్మెల్యేను కాదని వేరేవారితో జతకట్టుతున్నారంటా..పైగా మేము వేరు వాళ్లు వేరు అనే స్థాయిలో పార్టీలో వర్గపోరు రోజు రోజుకు జఠిలంగా మారుతుంది. దీనికి పార్టీలో సీనియర్స్అని చెప్పుకునే వారు మరింత ఆజ్యంపోస్తున్నారనే టాక్ సైతం నడుస్తుంది.
బోథ్ నియోజకవర్గంలో అయితే నేతల మద్య వార్ అధిష్టానం కు పిర్యాదులు చేసే కాడికెల్లిందంటా..ఓ నేత కులంపేరుతో దూషించాడని ఓ ప్రజాప్రతినిధి అక్కడక్కడ ఏర్పాటు చేసిన సభల్లో సైతం తన బాథవెల్లబోసుకున్నారంటా..ఆవీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ మూడు గ్రూప్ లుగా మారిందంటా..మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయం జరిగిన నాయకులు,సహాకార సంఘం ఎన్నికల్లో ఆశ నిరాశఅయిన నేతలు మూలకున్న నేతలతో గ్రూప్స్ ఏర్పాటు చేసామన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటా..తాజా ఓపండగను సైతం రాజకీయం చేసే ప్రయత్నంగా ఓ అడుగు ముందుకేసారంటా ..పండగకు రాజకీయాలకు ముడిపెట్టడం తప్పే అయినా ఇండికేషన్ ఇవ్వడం కోసమే అలా చేశారని ఇంకో వర్గం గట్టిగా నమ్ముతుంది.
ఏది ఏమైనా మాజీ ఎంపీ,ఓ నామినేటెడ్ పదవిలో ఉన్న నేత,ఎమ్మెల్యేలది ఇలా ముగ్గురిది మూడు గ్రూప్ లనే చర్చ జిల్లాలో కోనసాగుతుంది..దీనికితోడు ఓసామాజికవర్గాన్ని దెబ్బకొట్టేందుకు ఇంకో సామాజికవర్గం నేతలు సైతం ఏకమయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారంటా..ఏది ఏమైనా గ్రూప్ వార్ కు ఆజ్యం పోసేదెవ్వరో…దానికి కారకులెవ్వోరో అనేది మాత్రం అదిష్టానం నిశితంగా గమనిస్తుందంటా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం గులాబి దళంలో వర్గాల పై చర్చ జోరుగానే నడుస్తుంది.