తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సర్వేలన్నీ సీఎం కేసీఆర్ కే అనుకూలం

-

తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ప్రధాన పార్టీలన్నీ శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి 6 రకాల హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లగా బీసీ సీఎం నినాదంతో భారతీయ జనతా పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే హ్యాట్రిక్ కోసం అధికార బీఆర్ఎస్ పార్టీ సక్తియుక్తులన్నీ ఒడ్డి ఎన్నికల బరిలో పోరాడుతోంది. ఎన్నికల నేపథ్యంలో అనేక రకాల సర్వేలు ఓటర్ల మనోగతాన్ని వెలువరిస్తున్నాయి. దాదాపుగా అన్ని రకాల సర్వేలు బీఆర్ఎస్ పార్టీ కి అనుకూలంగా వస్తున్నాయి. తాజాగా న్యూస్ ట్యాప్ అనే సంస్థ నిర్వహించిన సర్వే కూడా అధికార పార్టీకి అనుకూలంగానే వచ్చింది.అధికార భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ నమోదు చేసేందుకు సునాయాసంగా విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.

brs party

సర్వేలో భాగంగా నవంబర్ 16 నుండి నవంబర్ 21 వరకు 1,19,000 నమూనాలను ఈ సంస్థ సేకరించింది. ఈ సర్వేను బట్టి చూస్తే బీఆర్ఎస్ కి 65 నుంచి 76 సీట్లు రానున్నట్లు తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్ఎస్. కేవలం కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఈ సర్వే చెప్తోంది.యువత, విద్యార్థులు మరియు డబుల్ బెడ్‌రూమ్ గృహాల లబ్ధిదారులు బీఆర్ఎస్ కి ఖచ్చితంగా ఓటు వేస్తారని సర్వే ఆధారంగా తెలిసింది.2018 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో 88 స్థానాల నుండి 65 – 76 స్థానాలకు బీఆర్ఎస్ పడిపోవచ్చు. అయినప్పటికీ మద్దతుదారు AIMIM తో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడోసారి ఏర్పాటు చేయనుంది. BRS పై వ్యతిరేకత తీసుకువచ్చేనoదుకు కాంగ్రెస్ పార్టీ అనేకవిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ అంతగా ప్రభావం చూపడం లేదనేది ఈ సర్వే సారాంశం. అయితే మొత్తం మీద 70 సీట్లతో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

గతంలో మాదిరిగానే ఇపుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది.కాంగ్రెస్‌లో నాయకత్వం గురించి, ప్రత్యేకించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో స్పష్టమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎన్నికల తరువాత ఎవరు అధికారంలో ఉంటారో ఆ పార్టీలోకి కాంగ్రెస్ నేతలు వెళ్ళవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు కాంగ్రెస్ పై ఇలాంటి విశ్వాసమే ఉంది. అయితే ఈ సర్వే ప్రకారం గతం కంటే ఎక్కువ ఓట్ల షేర్ ని రాబట్టుకోనుంది.కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ మరియు కర్ణాటకలో అస్థిర ప్రభుత్వ పరిస్థితులు ఇక్కడ శాపంగా మారబోతున్నాయి.

కర్నాటక ఎన్నికల వరకు తెలంగాణలో బలీయమైన శక్తిగా రెండవ స్థానంతో ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి ఉన్నప్పటికీ అది ఇప్పుడు AIMIM కంటే వెనుకబడి ఉంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ, గోషామహల్‌లోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇది BRS మరియు BJP మధ్య హోరాహోరీ పోరు అని కూడా గమనించవచ్చు. ఈ నియోజకవర్గాలలో INC మూడవ స్థానంలో ఉంది.

AIMIM ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్నీ కంచుకోటగా మార్చుకుంది. మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా మరియు బహదూర్‌పురా నియోజకవర్గాలు వారి ఖాతాలోకి చేరేవే. అయితే, రాబోయే ఎన్నికలలో, AIMIM అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ బలహీనంగా ఉండటంతో నాంపల్లిని కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక సీపీఐ విషయానికి వస్తే కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాత్రమే పోటీ చేస్తోంది.అక్కడ వారిదే ఆధిక్యత అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version