జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి విషయంలో ఏ విధంగా ముందుకెళుతున్నారో తెలిసిందే. ఆయన ఎన్నికల ముందు రాజధాని మారుస్తానని చెప్పలేదు..అమరావతిలోనే ఉంటారని చెప్పారు. కానీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా మూడు రాజధానులు అని చెప్పుకొచ్చారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచుతామని అన్నారు. అటు విశాఖని పరిపాలన రాజధానిగా, ఇటు కర్నూలుని న్యాయ రాజధాని చేస్తానని అన్నారు.
మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఏ రాజధాని లేదు. అయితే అమరావతి విషయంలో మాత్రం వ్యూహాత్మకంగానే వెళుతున్నారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ఆయన..ఊహించని విధంగా అమరావతిలో వేరే ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తప్పు కాదు ..కానీ రాజధాని కోసమని తాము భూములు ఇచ్చామని, ఇంకా తమకు ఫ్లాటులు కేటాయించలేదని, అభివృద్ధి చేయడం లేదని, అవేం లేకుండా రాజకీయ లబ్ది కోసం..అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అయితే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసీపీ అంటుంది. ఇక దీని వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఉందనే చెప్పాలి..ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వైసీపీపై వ్యతిరేకత ఉంది. దీంతో వేరే వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, వారిని అక్కడ ఓటర్లుగా చేరిస్తే రాజకీయంగా లబ్ది జరుగుతుందనేది జగన్ స్కెచ్. అందుకే దాన్ని అమరావతి రైతులు అడ్డుకుంటున్నారని అంటున్నారు.
ఇక ఇప్పటికే అమరావతి పరిధిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో ప్రభుత్వం విధ్వసంనానికి కుట్ర చేస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఈ నెల 24న ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాల్లో పాదయాత్రకు నిర్ణయించింది. అటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. చూడాలి మరి ఈ అంశం ఎంతవరకు వెళుతుందో.