భర్తతో బిగ్ బాస్ కి ఉదయభాను.. నిజమేనా..?

-

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం లభిస్తుంది. ముఖ్యంగా షో ప్రారంభానికి రెండు నెలల ముందే కంటెస్టెంట్ ల ఎంపిక జరుగుతుంది. అందులో భాగంగానే షో నిర్వాహకులు కూడా ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా వంద మందితో కూడిన జాబితాను మొదట తయారుచేసి అందులో 30 మందిని తీసి ఫైనల్ గా ఒక జాబితాను తయారు చేస్తారట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ వంద మంది జాబితాలో ఇద్దరుగా ఉదయభాను ఆమె భర్త నిలిచారట. అయితే హౌస్ లోకి రావడానికి ఉదయభాను ఓకే చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఈ దంపతులను పంపించడానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇకపోతే ఉదయభాను బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ప్రచారం జరగడంతో అభిమానుల సైతం నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే గతంలో వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. అందులోనూ చిన్నవాళ్ళు కావడంతో వారిని విడిచిపెట్టి వెళ్లలేను అని ఉదయభాను చెప్పిందట. కానీ ఇప్పుడు వారు పెద్ద పిల్లలు అయ్యారు. వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఈసారైనా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందా? రాదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక అసలు నిజం తెలియాలి అంటే బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపై స్పందించాల్సి వుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version