ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని బిల్లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ బిల్లు మండలికి వెళ్ళగా అక్కడ చర్చ జరగాలి అనే దానిపై తెలుగుదేశం పట్టుబడుతుంది. మండలిలో తెలుగుదేశం పార్టీకి మూడు వంతుల బలం ఎక్కువగా ఉంది. ఇక శాసన సభలో ఎస్సీ కమీషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా దానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
జై అమరావతి అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో అడ్డు తగిలారు. దీనితో దళితులపై అసలు తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదని, వారికి ఆ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. సభను అసలు ముందుకి సాగానీయలేదు. ఆ తర్వాత సభ నుంచి బయటకు వచ్చి శాసన సభ పోడియం వద్ద నిరసన తెలిపారు. దీనితో టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారం,
హెడ్ ఫోన్ విసిరేసి సభలో నుంచి వెళ్ళిపోయారు. దీనితో ఒక్కసారిగా చర్చ ఆగిపోయింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సభలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పక్కన కూర్చోవడం ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి ఆయన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించిన స్పీకర్, ప్రత్యేక సీటు కూడా కేటాయించిన వంశీ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే పక్కన కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.