ఏపీ కేబినెట్ స‌మావేశం.. అత్యంత గోప్యంగా ఎజెండా

-

ఏపీ కేబినెట్‌ సమావేశం మొద‌లైంది. అయితే కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నబిల్లులు, అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్‌ కమిటీ సిఫార్సుపై ప్రజెంటేషన్‌ ఉంటుంది. కాగా రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ, ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలు ఇచ్చిన విషయం విదితమే.

ఇక రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు నిర్ణయంపై కేబినెట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు.. అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రాజధాని రైతుల అంశంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణను లోకాయుక్తకు అప్పగించడానికి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు.. రైతు భరోసా కేంద్రాలపై కేబినెట్‌ చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news