అమరావతి-విశాఖ..క్లైమాక్స్‌కు క్యాపిటల్ కథ!

-

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే రాజధాని అంశంపై రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అమరావతిని రాజధానిగా పెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఓకే చెప్పారు. ఇక 2019 ఎన్నికల్లో రాజధాని మార్పుపై జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు.చెప్పి మూడున్నర ఏళ్ళు అవుతుంది..అయినా రాజధాని అంశం అలాగే ఉంది. చివరికి రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పలేని పరిస్తితి. అయితే ఇప్పటికే ఈ రాజధాని అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. అతి త్వరలోనే రాజధానిపై సుప్రీం కోర్టు తేల్చేసే అవకాశం ఉంది.

అయితే సుప్రీం తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ భావిస్తుంది. అందుకే విశాఖకు వెళ్ళేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అక్కడ నుంచే పాలన మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే హైకోర్టు రాజధాని మార్చడానికి లేదని చెప్పిందని, సుప్రీం కోర్టు కూడా అదే చెబుతుందని ప్రతిపక్ష టి‌డి‌పి, అమరావతి రైతులు ధీమాగా ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతినే రాజధానిగా పరిగణిస్తుంది. బి‌జే‌పి సైతం అమరావతికే మద్ధతు ఇస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని అంశంపై ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.అయితే పేరుకు మూడు రాజధానులు అని చెబుతున్నా సరే జగన్ ప్రభుత్వం అసలు కాన్సెప్ట్ విశాఖ రాజధాని అని చెప్పవచ్చు. అందుకే విశాఖ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎక్కడ ఉన్నా, హైకోర్టు ఎక్కడ ఉన్నా విశాఖ అసలు రాజధాని అనే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. మరి రాజధానిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version