నకిలీ చలానాల కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నకిలీ చలానాల కేసులో కడప సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జింకా రామకృష్ణ, లక్ష్మినారాయణ, గురు ప్రకాశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ చలానాలతో వీరు రూ. కోటి 3 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి రూ. 67 లక్షలను రికరవీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ల్యాప్ ట్యాప్ లు, ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల విషయం వెలుగులోకి రాలేదని.. అసలు ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతోందని అధికారులపై నిన్న ఏపీ సీఎం జగన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ ఈ కేసులు ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు అరెస్ట్ అయ్యారు.