వైఎస్సార్ జయంతి సందర్భంగా కడప జిల్లా ప్రజలకు జగన్.. వరాల జల్లు కురిపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడంతో పాటు.. కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
కడప ఉక్కు పరిశ్రమ ఆగిపోయింది. దాని పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారు. డిసెంబర్ 26న జగన్ అనే నేను వచ్చి.. ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా.. అని హామీ ఇస్తున్నా. కేవలం మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు అందిస్తా.. అని కూడా మాటిస్తున్నా.. మీ అందరి కలలను సాకారం చేస్తా.. అని సగర్వంగా చెబుతున్నా… ఈ ప్రాజెక్టు పూర్తయితే 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.. అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. ఆయన కడప జిల్లాలో పర్యటించారు. వైఎస్సార్ జయంతిని ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. ప్రసంగించారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా కడప జిల్లా ప్రజలకు జగన్.. వరాల జల్లు కురిపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడంతో పాటు.. కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు.. గండి కోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది 20 టీఎంసీల నీరు నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని జగన్ హామీ ఇచ్చారు.