టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉన్న సంగతి అందరికీ విదితమే. ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. టీడీపీని బలోపేతం చేసే మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీసీ నేతలు లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు. కాగా, లోకేశ్ రాజకీయాలకు బ్రేక్ పడనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణం వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై లోకేశ్ స్పందిస్తూ ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణంలో పాత్ర ఉన్నవాళ్లను అరెస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. దాంతో లోకేశ్ ఇక సైలెంట్ అయ్యే చాన్సెస్ ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.
నారా లోకేశ్ చుట్టు బిగస్తున్న ఉచ్చు..?
-