మొత్తానికి కొడాలి నాని చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏంటో మరి ఆయన ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు కొడాలి లేకుండా వార్తలే ఉండటం లేదు. నిత్యం ఏదొక విషయంలో కొడాలి వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. పోనీ మంత్రిగా అద్భుతమైన పనితీరు కనబర్చి ఆయన ఏమన్నా వార్తల్లో ఉంటున్నారా? అంటే అదీ కాదు…కేవలం చంద్రబాబుని పచ్చి బూతులు తిడుతూ వార్తల్లో ఉంటున్నారు. సరే కొడాలి ఏం బూతులు తిడుతున్నారో వాటిని రాస్తే కూడా బాగోదు. మరి ఆ రేంజ్‌లో కొడాలి తిడుతున్నారు.
అయితే అధికార పార్టీ నేతలు ఎన్ని బూతులు మాట్లాడినా అరెస్టులు ఉండవనే సంగతి తెలిసిందేగా…అందుకే బుద్దాని వెంటనే అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద రావడం జరిగిపోయాయి. ఇలా ఏపీలో రచ్చ నడుస్తోంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. కొడాలికి వైసీపీ నేతల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తున్నట్లు కనిపించడం లేదు.
అదే సమయంలో కొడాలిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే డౌట్ పడే పరిస్తితి వస్తుంది. అసలు కొడాలి కావాలని బూతులు తిడుతూ, చంద్రబాబుపై సానుభూతి పెంచుతూ, వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నారా? అని కొందరు వైసీపీ కార్యకర్తలు అనుమానిస్తున్నారు. అసలు బాబుకు కొడాలి కోవర్టు మాదిరిగా పనిచేస్తూ వైసీపీని నాశనం చేస్తున్నారని అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారని తెలిసింది. కానీ కొడాలి మాత్రం జగన్ అంటే ప్రాణం ఇచ్చేస్తారని సంగతి తెలిసిందే. అయినా సరే కొడాలిపై సొంత పార్టీ వాళ్ళకే అనుమానం వస్తుంది.