ఫార్ములా మార్చిన బాబు…ప్లాన్ వర్కౌట్ అవుతుందా!

-

ప్రస్తుతం రాజకీయాల్లో చంద్రబాబు…చావో, రేవో పరిస్తితిని ఎదురుకుంటున్న విషయం తెలిసిందే…ఎందుకంటే రాజకీయంగా నిలదొక్కుకోవడానికి గాని, టీడీపీని నిలబెట్టడానికి చంద్రబాబుకు ఇదే చివరి అవకాశం. ఇంకోసారి గాని ఓడిపోతే…ఇంకా పార్టీ పరిస్తితి దారుణంగా తయారవుతుంది…అలాగే చంద్రబాబు సైతం మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం…పైగా ఆయనకు వయసు కూడా మీద పడింది. అందుకే వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు అన్నట్లు బాబు కష్టపడుతున్నారు.

ఈ వయసులో కూడా రోడ్ షోలు చేయాల్సి వస్తుంది… జిల్లాలు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. మళ్ళీ పార్టీని గాడిల పెట్టడానికి తెగ కష్టపడాల్సి వస్తుంది. ఈ సారి ఎలాగైనా వైసీపీని నిలువరించి అధికార పీఠం దక్కించుకోవాలని చెప్పి బాబు పనిచేస్తున్నారు. అయితే అధికారం దక్కించుకోవడం కోసం బాబు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు…ఎక్కడకక్కడ వైసీపీకి చెక్ పెట్టేందుకు దూకుడుగా పనిచేస్తున్నారు.

ఇదే క్రమంలో ఎప్పుడూలేని విధంగా బాబు రాజకీయం చేస్తున్నారు. మునుపటి మాదిరిగా కాకుండా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా స్పీచ్ లు ఇస్తున్నారు. అసలు పూర్తిగా బాబు కొత్త ఫార్ములాతో ముందుకొచ్చారు. మామూలుగా చంద్రబాబు స్పీచ్ లు జనాలకు ఎక్కవనే చెప్పాలి. బాబు మాట్లాడుతుంటే ఏదో కాలేజ్ లో లెక్చరర్ మాట్లాడుతున్నట్లే ఉంటుంది…ఆయన స్పీచ్ లు పూర్తిగా బోరు కొట్టేస్తాయి.

అయితే ఇదంతా ఒకప్పుడు…ఇప్పుడు కాదు..ఇప్పుడు పూర్తిగా మాస్ స్పీచ్ లతో బాబు, ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు…ఆఖరికి పరుష పదజాలం సైతం వాడుతున్నారు. వైసీపీ వాళ్ళకు వారి భాషలోనే సమాధానం చెప్పాలని అంటున్నారు. అలాగే సమస్యలపై పోరాడాలని ప్రజలని రెచ్చగొడుతున్నారు…మీరు పిరికివాళ్లని, వైసీపీ కేసులు పెడుతుందని పోరాడకుండా భయపడుతున్నారని ప్రజలని రెచ్చగొడుతున్నారు. ఇలా బాబు పూర్తిగా కొత్త పంథాతో రాజకీయం చేస్తున్నారు. మరి ఈ ఫార్ములా బాబుకు రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version