ఏపీలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఓడిపోయి దారుణమైన పరిస్తితుల్లో ఉన్న పార్టీని బలోపేతం చేసి..ఇప్పుడు వైసీపీకి ధీటుగా నిలబెట్టేలా చేశారు. ఇక ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇద్దరు కష్టపడుతున్నారు. ఓ వైపు అధికార బలంతో ఉన్న వైసీపీకి ధీటుగా నిలబడుతూనే..మరో వైపు టిడిపి నేతలకు దిశానిర్దేశం చేస్తూ…పోరాటం చేసేలా చేస్తూ..పార్టీకి మైలేజ్ పెంచారు.
ఇక ఇద్దరు నేతలు ప్రజల్లో తిరుగుతూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎపుడు ఏదొక ప్రజా సమస్యపై బాబు ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. గతేడాది నుంచి బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. రోడ్ షోలు, భారీ సభల్లో పాల్గొంటున్నారు. ఇక బాబు టూర్లకు ప్రజా స్పందన పెరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాస్త గ్యాప్ ఇచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తున్నారు.
ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తుండగా, నెలాఖరికి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల వరకు బాబు ప్రజల్లోనే ఉండనున్నారు. ఇటు లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. మొదటలో పాదయాత్రకు ప్రజా స్పందన పెద్దగా రాలేదు గాని..నిదానంగా పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ముగించుకుని..అనంతపురంలో పాదయాత్ర చేస్తున్నారు. రెండు జిల్లాల్లో మంచి స్పందన వచ్చింది. నెక్స్ట్ కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది.
ఈ పాదయాత్ర వల్ల మొదట పార్టీకి పెద్ద ఉపయోగం ఉండదని చర్చ సాగింది గాని..ఇప్పుడు పాదయాత్ర వల్ల పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే చర్చ వస్తుంది. మొత్తానికి చంద్రబాబు, చినబాబు ప్రజల్లో ఉండటం వల్ల టిడిపికి ప్లస్ అవుతుంది.