కావాలని తీసుకొచ్చారో లేక…ప్రజలకు మేలు కలగాలని చేశారో తెలియదు గాని..జగన్ ప్రభుత్వం సడన్‌గా జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చింది. దీని వాళ్ళ లాభం ఏంటి అనేది సరిగ్గా క్లారిటీ లేకపోయినా..ఇప్పుడు ఈ జిల్లాల విభజన వల్ల పెద్ద రచ్చ నడుస్తోంది. అసలు జన గణన పూర్తి కాకుండా జిల్లాల విభజన జరగదు….ఇప్పటికే దీనిపై కేంద్రం ఆదేశాలు ఉన్నాయి…మరి అలాంటప్పుడు జిల్లాల విభజన చేసి…లేని పోని తలనొప్పులని తీసుకొచ్చారు.
అంటే ఈ రచ్చ జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం ముందే ఊహించిందా? అసలు రాష్ట్రంలో ఉన్న సమస్యలని డైవర్ట్ చేయడానికి జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చారా? అనే అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి అదే నిజమనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి…ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు..ఇవన్నీ పక్కకువెళ్ళి…కేవలం ప్రజలంతా జిల్లాల విభజన గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే సమస్యలు పక్కకు వెళ్లాలనే జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
ఇక ఈ జిల్లాల విభజనపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించలేదు. కింది స్థాయిలో టీడీపీ నేతలు స్థానికంగా స్పందిస్తున్నారు తప్ప..రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే దీనిపై చంద్రబాబు ఆచి తూచి ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల విభజనపై ఆయన, తమ పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం..వీటిల్లో ఉన్న లోపాలని తెలుసుకుని అప్పుడు స్పందించాలని బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ జిల్లాల జగడం కంటిన్యూ అయ్యేలా ఉంది.