బండి విడుదల..కొత్త ఆట మొదలు..!

-

రాజకీయాల్లో ఒకటి చేస్తే దానికి మించి చేయాలనేది కాన్సెప్ట్..ఎదుట పార్టీ ఒక ఎత్తుతో వస్తే..దానికి పై ఎత్తు వేసి చెక్ పెట్టాలని ప్రతి పార్టీ అనుకుంటుంది. ఇప్పుడు తెలంగాణలో అలాగే జరుగుతుంది. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఒక ఎత్తు వేసి చెక్ పెడితే..ఆ పార్టీకి మరో ఎత్తు వేసి చెక్ పెట్టాలని బి‌జే‌పి చూస్తుంది. ఇప్పటివరకు పేపర్ల లీకేజ్ అంశంలో బి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌జే‌పి ఇరుకున పెడుతూ వచ్చింది.

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ల లీక్ అంశంలో విమర్శలు చేసింది..అందులో కే‌టి‌ఆర్ ప్రమేయం ఉందని టార్గెట్ చేసింది. ఇలా కే‌సి‌ఆర్ సర్కారుని ఇరుకున పెడుతూ వచ్చింది. కానీ సడన్ గా బి‌ఆర్‌ఎస్ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. వరుసగ్ టెన్త్ పేపర్లు లీక్ అవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ..ఊహించని విధంగా బండి సంజయ్‌ని టార్గెట్ చేసింది. బండి సంజయ్..కావాలని కొందరు అనుకూల టీచర్ల చేత పేపర్లు లీక్ చేయించి..తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూశారని, కానీ కుట్రని చేధించి బండిని అరెస్ట్ చేశామని బి‌ఆర్‌ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు.

అయితే ఈ పేపర్ల లీకులో బండి సంజయ్ ని అరెస్ట్ చేసి బి‌జే‌పిని నిలువరించారు. అలా బి‌జే‌పిని నిలువరించడంతో రాజకీయ పోరు మరో ఎత్తుకు వెళ్లింది. అలా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి వెనక్కి తగ్గదుగా అందుకే..బి‌జే‌పి కూడా సరికొత్త వ్యూహాలతో ముందుకు రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

బండి సంజయ్‌కు ఫుల్ ఫ్రీడం ఇచ్చేసి..ఆయన దూకుడు మరింత పెంచాలని చూస్తున్నారు బెయిల్ పై విడుదల అయిన ఆయన..ఇంకా దూకుడుగా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎలాగో మోదీ పర్యటన ఉంది. ఆ పర్యటనని విజయవంతం చేసి అక్కడ నుంచి కే‌సి‌ఆర్ సర్కారు టార్గెట్ గా పోరాటం మరింత ఉదృతం చేస్తారని తెలుస్తోంది. ప్రజా సమస్యలపై కే‌సి‌ఆర్ సర్కారుని ఇరుకున పెడతారని తెలుస్తోంది. చూడాలి మరి ఇంకా బండి రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version