ఏపీలో బండి ఎంట్రీ..బాబు-పవన్‌తో కలిసే..!

-

తెలంగాణ రాజకీయాల్లో మొన్నటివరకు దూకుడుగా రాజకీయాలు చేసిన బండి సంజయ్..ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడ బి‌జే‌పి బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి..ఏపీలో అడుగుపెట్టి..అక్కడ జగన్ ప్రభుత్వంపై పోరు ముమ్మరం చేయనున్నారు. అయితే తెలంగాణలో బి‌జే‌పి పుంజుకోవడంలో బండి పాత్ర చాలా ఉంది. బండి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం టార్గెట్ గా ముందుకెళ్లారు. బి‌జే‌పికి కీలక విజయాలు అందించారు.

పాదయాత్ర చేశారు..పార్టీని బలోపేతం చేశారు. కానీ ఇటీవల జరిగిన అధ్యక్షుల మార్పుల్లో తెలంగాణలో బండిని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు. ఇటు ఏపీలో సోము వీర్రాజుని సైడ్ చేసి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. ఇక బండిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీంతో బండి..ఆ హోదాలో ఈ నెల 21న ఏపీలో పర్యటిస్తున్నారు. అది కూడా రాజకీయ కేంద్రం విజయవాడలో ఎంట్రీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బి‌జే‌పి బలోపేతం, జగన్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం…అలాగే ఓటరు నమోదు ప్రక్రియని సమీక్షించనున్నారు.

అయితే ఇప్పటికే బి‌జే‌పితో కలిసి పవన్ పనిచేస్తున్నారు. ఇక టి‌డి‌పితో కలిసి పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని నిలువరించగలమని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబుని కూడా కలుపుకుని ఎన్నికల బరిలో దిగాలని పవన్ చూస్తున్నారు. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు కోసమే అధ్యక్ష పదవి కూడా మార్చారని తెలుస్తోంది. ఇప్పుడు బండిని పంపి..ఆ మూడు పార్టీల బంధం మరింత బలపడేలా చేసి..వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేలా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏపీలో బండి రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version