డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు : బండి సంజయ్

-

డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పాపన్న విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మద్యం టెండర్ల ద్వారా ఆదాయం సంపాదిస్తుంది.బీఆర్ఎస్,కాంగ్రెస్ కాస్లీ పార్టీలు అని.. రెండు నెలల్లో ముఖ్యమంత్రి, మంత్రి ఇంటికి పోతారని పేర్కొన్నారు.

ఇంకా రెండు నెలలు టైమ్ ఉన్న ముందే మద్యం టెండర్లు పెట్టాడు. నవంబర్ వరకు టెండర్ల కు సమయం ఉంది. కానీ ముందే 2000 కోట్ల రూపాయలు సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. సంవత్సరానికి 50 వేల కోట్లు సంపాదించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు అని..  కాంగ్రెస్ పార్టీ కి పోటీ చేసే అభ్యర్థులే లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఇంతకు ముందు పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క దరఖాస్తు కు 50 వేలు అని చెప్పడం ఏంటి? డబ్బులు లేని వారు ఎవరు పోటీ చెయ్యొద్దని కాంగ్రెస్ అనుకుంటుంది. అందుకే డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్స్మంచి చేసే వారికి టికెట్ లేదు. డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version