బండి ఆఫర్లు..ఆ నేతలు యూజ్ చేసుకుంటారా?

-

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా బండి సంజయ్ ముందుకెళుతున్నారు.. అసలు డిపాజిట్లు కూడా లేని పార్టీని చాలావరకు బలపడేలా చేశారు…నిజానికి బండి అధ్యక్షుడు అయ్యాక బీజేపీకి కొత్త ఊపు వచ్చింది…బలమైన కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి..బీజేపీని రేసులోకి తీసుకొచ్చారు…టీఆర్ఎస్‌కు ధీటుగా పార్టీని నిలబెట్టారు..అలాగే టీఆర్ఎస్ సైతం…బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధిగా చూస్తుంది..అంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వార్ మారడంలో బండి పాత్ర చాలా ఉంది.

అయితే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బండి ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో వస్తున్నారు…బలమైన వ్యూహాలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టే సత్తా ఉన్న కేసీఆర్‌ని సైతం ఢీకొడుతూ బండి ముందుకెళుతున్నారు…కేసీఆర్ పూర్తిగా బీజేపీనే ఎటాక్ చేస్తూ ఉన్నా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బండి పనిచేస్తున్నారు..ఓ వైపు కేసీఆర్‌తో పోరాడుతూనే…మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ బండి ముందుకెలుతున్నారు.

ఇటీవల కాలంలో బండి పార్టీ బలోపేతంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే…బీజేపీ పుంజుకున్న మాట వాస్తవమే..కానీ క్షేత్ర స్థాయిలో బలం తక్కువగా ఉంది..ఇప్పుడు బండి అదే అంశంపై ఫోకస్ పెట్టారు…బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో పనిచేస్తున్నారు.

ఇటీవల కాలంలో పార్టీ ఇంచార్జ్‌లని దిశానిర్దేశం చేయడం…ఎస్సీ, ఎస్టీ స్థానాలపై ఫోకస్ చేసి పనిచేయడం..అలాగే వీక్ గా ఉన్న జిల్లాలపై కూడా బండి ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలని ఇంకా పికప్ చేయడానికి బండి కష్టపడుతున్నారు…ఈ క్రమంలోనే నేతలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తారని చెప్పి…బండి తమ నేతలకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. కష్టపడి పనిచేసిన వారికి మంచి మంచి పదవులు వస్తాయని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు కష్టపడి పనిచేయడంవల్లే.. మళ్లీ అక్క‌డ‌ అధికారంలోకి వచ్చామని.. అదే స్పూర్తితో పని చేయాల‌ని జిల్లా అధ్యక్షులకు సూచించారు. యూపీలో కష్టపడి పనిచేసిన జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్సీ సహా అనేక నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించినట్లు గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై పోరాడేలా కార్యాచరణ రూపొందించి ఆందోళనలు నిర్వహించాలని వివ‌రించారు. అంటే పోరాడే నేతలకు పదవులు వస్తాయని బండి చెప్పేస్తున్నారు…మరి బండి ఇస్తున్న ఆఫర్‌ని బీజేపీ నేతలు సరిగ్గా యూజ్ చేసుకుంటారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version