గంగులని ఈ సారి ‘బండి’ బోల్తా కొట్టిస్తారా?

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు కాకముందు వరకు బండి రాష్ట్రంలో పెద్దగా హైలైట్ కాలేదనే చెప్పొచ్చు. అధ్యక్షుడు అయ్యాక బండి తనలోని ఫైర్ అంతా బయటపెడుతూ, అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నారు.  ఇంకా చెప్పాలంటే బండి అధ్యక్షుడు అయ్యాకే బీజేపీ లైన్‌లో పడింది. అధికార టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం కావొచ్చు..జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో గులాబీ పార్టీకి గుండెల్లో దాదా పుట్టించడంలో బండి పాత్ర ఎక్కువగా ఉంది.

ఇక ఇప్పుడు హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించి, కేసీఆర్‌ని మరింత టెన్షన్ పెట్టాలని చూస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బండి ఫిక్స్ అయ్యారు. అందుకే తెలంగాణలో ఇంతవరకు ఏ బి‌జే‌పి అధ్యక్షుడు చేయని విధంగా బండి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా అన్నీ రకాలుగా బి‌జే‌పిని పైకి లేపడానికి బండి ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో తాను కూడా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాడానికి బండి ఇప్పటినుంచే అదిరిపోయే వ్యూహాలతో  ముందుకెళుతున్నారు. గత రెండు ఎన్నికల్లో బండి సంజయ్…బి‌జే‌పి తరుపున కరీంనగర్ అసెంబ్లీ స్థానలో పోటీ చేసి, టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోతున్న విషయం తెలిసిందే.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక బండి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ వచ్చే ఎన్నికల్లో బండి మళ్ళీ, కరీంనగర్ అసెంబ్లీలోనే పోటీ చేస్తారని తెలుస్తోంది. అక్కడ నుంచే బరిలో దిగి..ఈసారి గంగులకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బి‌జే‌పి అధ్యక్షుడుగా బండికి క్రేజ్ పెరిగింది. అలాగే రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. అటు టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారి కరీంనగర్ అసెంబ్లీలో గంగులని బోల్తా కొట్టించాలని బండి రెడీ అవుతున్నారు. మరి చూడాలి ఈ సారి బండికి ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ దక్కుతుందేమో?

Read more RELATED
Recommended to you

Exit mobile version