బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు..ఈ సారైనా కరీంనగర్ అసెంబ్లీలో గెలిచే అవకాశాలు ఉంటాయా? ఈ సారి గంగుల కమలాకర్‌ని ఓడిస్తారా? లేక వేరే సీటు మార్చుకుంటారా? అంటే..బండి ఆలోచన ఎలా ఉంది..బీజేపీ అధిష్టానం ఏది డిసైడ్ చేస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు..కానీ బండి అనుచరులుకు గాని, బిజేపి శ్రేణులుకు గాని..బండి కరీంనగర్ లోనే పోటీ చేసి..గంగులకు చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఓడిన చోటే గెలిచి చూపించాలని అంటున్నారు.
గత రెండు ఎన్నికల్లో గంగుల చేతులో బండి ఓటమి పాలవుతున్న విషయం తెలిసిందే. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బండి ఓడిపోయారు. అయితే 2018లో ఓడిపోయిన తర్వాత..2019లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి బండి గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అసెంబ్లీలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి బిజేపి బలం పెరగడం, బండి బలం ఇమేజ్ ఇంకా పెరగడం పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.
అటు వరుసగా గెలిచిన గంగులపై కరీంనగర్ లో కాస్త యాంటీ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారి కరీంనగర్ లో బండి-గంగుల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ కొద్దో గొప్పో బండిపై సానుభూతి ఉందని తెలుస్తోంది. అదే సమయంలో బండి గాని నెక్స్ట్ సీటు మార్చుకుంటారా? అనే టాక్ వస్తుంది. ఈ సారి బండి వేములవాడ స్థానంలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
కానీ ఓడిన చోటే గెలిస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది..బండి కూడా అదే ఫాలో అవుతారా? లేక సీటు మార్చుకుని ముందుకెళ్తారా? అనేది చూడాలి. కానీ కరీంనగర్ లో బండి నిలబడితే..ఈ సారి గంగులకు గెలుపు కష్టమయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి బండి చివరికి ఎక్కడ పోటీ చేస్తారో.