బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి….ఏపీ రాజకీయాల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న యువ నాయకుడు. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో ఎదిగిన నేత. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా సరే…ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలో చేరి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడు అయ్యారు. అలాగే నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉంటూ…అక్కడ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీకి భారీ మెజారిటీ రావడంలో బైరెడ్డి కృషి ఉందని చెప్పొచ్చు.
అయితే ఇలా వైసీపీకి ప్లస్‌గా మారిన బైరెడ్డికి నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా సీటు ఇస్తే బెటర్ అని వైసీపీ యువ శ్రేణులు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం బైరెడ్డికి నామినేటెడ్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ బైరెడ్డిని నామినేటెడ్ పదవులకు కాకుండా ఏదైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇస్తే ఇంకా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు.
కాకపోతే కర్నూలు జిల్లాలో సీట్లు అన్నీ ఫుల్. బైరెడ్డి ఉన్న నందికొట్కూరు ఏమో ఎస్సీ రిజర్వడ్ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి లేదు. మిగిలిన అసెంబ్లీలు ఖాళీ లేవు. కాకపోతే గత రెండు ఎన్నికల్లో జగన్..ఎంపీ సీట్లలో అభ్యర్ధులని మార్చారు. దీని బట్టి చూస్తే బైరెడ్డికి ఎంపీ సీటు ఇచ్చిన బెనిఫిట్ ఉంటుందని అంటున్నారు. కానీ ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే మెచ్యూరిటీ బైరెడ్డికి లేదనే కోణం కూడా మరొకటి వస్తుంది. కానీ ఏదేమైనా బైరెడ్డి లాంటి నాయకులని ఇంకా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.