Pushpa Movie: పుష్ప ఐటమ్ సాంగ్.. షాకింగ్ రెమ్యూనరేషన్ అడిగిన ఫారిన్ హాట్ క్వీన్..!

-

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ ముద్దుగుమ్మ ర‌స్మిక మంద‌నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించ‌బోతున్న‌.. ఈ సినిమాను రెండు భాగాలుగా రానున్నది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.


దీనిని డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ద‌మ‌య్యారు. పోస్ట్ ప్రోడ‌క్ట‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ (డీఎస్పీ) సంగీతం అందిస్తున్నారు.

బన్నీ, డీఎస్పీ, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్‌లో తెర‌కెక్కితున్న సినిమాలో ఐటం సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఆర్య ఆర్య2 మూవీలోని సాంగ్ ని మించిపోయాలా.. పుష్పలో ఓ ఐటం సాంగ్‌ కంపోజ్‌ చేస్తున్నాడట మ్యూజిక్ మంత్రికుడు డీఎస్పీ.

ఈ ఐటం సాంగ్ లో బన్నీతో స్టెప్పులేయడానికి.. ఓ హాట్ బ్యూటీని సంప్రదించిన‌ట్టు ఓ ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇప్ప‌టికే దిశాపటానీ, ఊర్వశి రౌతేలా, మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌, జాక్వెలిన్ పెర్నాండెజ్, పూజా హెగ్డే, కత్రినా కైఫ్ అంటూ పలువురు పేర్లను పరిశీలించారట సుకుమార్ అండ్ కో టీం. కానీ, వీరు సానుకులంగా లేక‌పోవ‌డంతో ఫారిన్ హాట్ క్వీన్ నోరా ఫతేహి సంప్రదించినట్లు ఫిల్మీదునియాలో టాక్‌ వినిపిస్తోంది. అయితే నోరా డిమాండ్ విని ఒక్కసారిగా షాకయ్యారట.

కేవ‌లం ఐదు నిమిషాల సాంగ్ కోసం.. హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. గతంలో టెంపర్ సినిమాలో ఐటం సాంగ్ కోసం.. కేవలం 5 లక్షలు తీసుకున్న ఈ అమ్మ‌డు. ఇప్పుడు ఐదు నిమిషాల పాట కోసం ఏకంగా రెండు కోట్లు అడ‌గ‌డంతో షాకయ్యారు.

నోరా ఫతేహి ఈ సాంగ్ చేస్తే సినిమా హిందీ మార్కెట్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. అలాగే.. సోషల్ మీడియాలో నోరాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకు నెట్టింట్లో లక్షల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ 2 కోట్లు అంటే ఎక్కువని ఆలోచిస్తున్నారట. త్వరలోనే నోరా విషయంలో ఫైన‌ల్ అప్డేట్ రానున్న‌ది.

Read more RELATED
Recommended to you

Exit mobile version