సాక్షాత్తు సీతారామచంద్రులు కొలువై ఉన్న భద్రాచలంలో రాజకీయం ఈ సారి వాడి వేడిగా సాగేలా ఉంది. ఇంతకాలం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ సీటులో పాగా వేయడానికి బిఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది. అటు తమ పట్టుని నిలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. గతంలో ఇక్కడ సిపిఐ పలుమార్లు సత్తా చాటింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలంలోని పోలవరం ముంపు మండలాలని ఏపీలో కలిపారు. దీంతో భద్రాచలం పరిధి మారింది.
అలాగే రాజకీయం కూడా మారింది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.కాంగ్రెస్ నుంచి పోడెం వీరయ్య గెలిచారు. వీరయ్య గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ కు పట్టు ఉండటం అదే సమయంలో గత ఎన్నికల్లో టిడిపి, కమ్యూనిస్టులు కాంగ్రెస్ లో పొత్తులో ఉన్నాయి. దీంతో ఆ పార్టీల మద్ధతు కాంగ్రెస్ కు కలిసొచ్చింది. విజయం సాధించింది. అయితే మళ్ళీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాలోని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. కానీ వీరయ్య వెళ్లలేదు.
ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అటు బిఆర్‌ఎస్ నుంచి బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. దాదాపు ఈయనే బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి తెల్లం వెంకటరావు పోటీ చేసి ఓడిపోయారు. ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీకి దూరమయ్యారు. ఆయన వర్గంలో నేతగా ఉన్న తెల్లం కూడా బిఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. కానీ దీని కంటే ముందు భద్రాచలం బిఆర్‌ఎస్ ఇంచార్జ్ బాలసానిని నియమించారు. దీంతో తెల్లం పార్టీకి పూర్తిగా దూరమయ్యారు.
ఇప్పుడు ఆయన పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరతారు. కాంగ్రెస్ లో చేరిన సీటు వీరయ్యకే. ఇక పొంగులేటి వర్గం సపోర్ట్ వీరయ్యకు కలిసి రావచ్చు. అటు బిఆర్‌ఎస్ కు కమ్యూనిస్టుల మద్ధతు ఉంది. దీంతో ఈ సారి భద్రాచలంలో హోరాహోరీ పోరు సాగడం ఖాయం. కానీ పొత్తు ఉంటే ఈ సీటు తీసుకోవాలని కమ్యూనిస్టులు చూస్తున్నారు. మరి సీటు విషయంలో కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కమ్యూనిస్టుల మద్ధతు ఉంటేనే ఇక్కడ బిఆర్‌ఎస్‌కు ప్లస్..లేదంటే మళ్ళీ గెలుపు డౌటే.