కరోనా వైరస్ గురించి ఇటలీ దేశ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు మనలాగే పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఇటలీ దేశమంతా స్మశానం గా మారింది. ఆ దేశ ప్రజలు కుప్పలుతెప్పలుగా చనిపోతున్నారు. ఎక్కువగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడంతో…ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఆ దేశమంతా ఇప్పుడు అతలాకుతలమైంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో కూడా జనతా కర్ఫ్యూ విధించిన గాని తెలుగు రాష్ట్రాల ప్రజలు ….ఇటలీ ప్రజల మాదిరిగానే వ్యవహరించటం అందరికీ భయాన్ని తీసుకు వస్తుంది.
కాబట్టి తెలుగు ప్రజలు వీలైనంతవరకు ఇంటిలోనే ఉంటే బెటర్ అని….గుంపులు గుంపులుగా ఎవరూ కూడా బయటకు రాకూడదు అని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ విషయం సీరియస్ గా తీసుకోకుండా ఉంటే ఊహకి అందని విధంగా….ప్రపంచం మారిపోతుందని, మరో ఇటలీ దేశంగా రెండు తెలుగు రాష్ట్రాలు తయారవుతాయని కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చాలా మంచి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.