కొన్ని కొన్ని సున్నిత ప్రాంతాల్లో బిజెపి నేతలు, కార్యకర్తలు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా దేశ సరిహద్దుల విషయంలో బిజెపి నేతలు స్పందించే తీరు అక్కడి కార్యకర్తలు స్పందించే తీరుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో బిజెపి కార్యకర్తలు కాస్త ఓవర్ యాక్షన్ చేసారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం విషయంలో విపక్షాలు ఆందోళనలు చేస్తుంటే ఈ తరహా చర్యలతో వివాదాలను మరింతగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు అని పలువురు విమర్శిస్తున్నారు.