కుప్పంలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ పాదయాత్రలు.. టెన్షన్ టెన్షన్ !

-

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ, టీడీపీ పోటా పోటీ పాదయాత్రలు, ర్యాలీలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హంద్రీనీవా సాధన కోసం టీడీపీ కార్యకర్తలు పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వారికీ పోటీగా పేదల ఇళ్లపట్టాలపై టీడీపీ కోర్టునాశ్రయించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ తలపెట్టింది. పోటాపోటీ కార్యక్రమాలకు నిర్వహిస్తుండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పోలీస్ -30 యాక్ట్ అమలులోకి తీసుకు వచ్చారు.

టీడీపీ మహా పాదయత్రకు వెళ్లకుండా పలువురు నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పి ఏ మనోహర్, కుప్పం తెదేపా ఇంచార్జి పి ఎస్ మునిరత్నం సహా పలువురిని గృహనిర్బంధంలో ఉంచారు. టీడీపీ నాయకుల గృహ నిర్భంధాలను ఖండించిన చంద్రబాబు హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version